Header Banner

కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు! నిందితులకు మూడు రోజుల సిట్ కస్టడీ సిద్ధం!

  Tue Mar 04, 2025 09:07        Politics

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు నిందితులు పొమిల్‌ జైన్‌, అపూర్వ వినయ్‌కాంత్‌ చావడాలను కోర్టు మూడు రోజుల సిట్‌ కస్టడీకి అప్పగించింది. తిరుపతి 2వ ఏడీఎం కోర్టు సోమవారం ఈ మేరకు అనుమతిచ్చింది. గత నెల 9న నలుగురు నిందితులు అరెస్టు కాగా, నలుగురినీ 14 నుంచి 18వ తేదీ వరకు(ఐదు రోజులు) సిట్‌ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. 18న ఆ నలుగురినీ జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించిన సిట్‌ అధికారులు ఆ మరుసటి రోజే ఏ3, ఏ5 లను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్‌ వేశారు. వారిని ఇదివరకే సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకుని ఐదు రోజులు విచారించిన కారణంగా మళ్లీ కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని వారి తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టులో వాదించారు.

ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!


అయితే, కల్తీ నెయ్యి కేసులో వీరిద్దరూ కీలక నిందితులని, గతంలో సిట్‌ అధికారులు ఐదురోజులు కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ నిందితులు విచారణకు సహకరించలేదని ఏపీపీ జయశేఖర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. టీటీడీ వంటి ప్రతిష్టాత్మక ధార్మిక సంస్థను మోసగించడం ద్వారా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినడానికి నిందితులు కారకులయ్యారన్నారు. వారిని మరింత లోతుగా విచారించడం ద్వారానే వాస్తవాలు వెల్లడవుతాయని వివరించారు. ఏపీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి కోటేశ్వరరావు ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ సిట్‌ కస్టడీకి అప్పగించేందుకు అనుమతి జారీ చేశారు. కాగా, ఈ కేసులో ఏ5 నిందితుడు అపూర్వ వినయ్‌ కాంత్‌ చావడా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 6వ తేదీకి వాయిదా పడింది. అలాగే, ఏ3, ఏ4 నిందితులకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వారి తరఫు న్యాయవాదులు సోమవారం మరోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం!  రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!



పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!


బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?


రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..


చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..

ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!

రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ghee #laddu #thirupathi #todaynews #flashnews #latestnews